News

అసెంబ్లీకి వెళ్తాను


వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ కార్యాలయం వరకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని అసెంబ్లీకి వెళ్తానని అన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కమీషన్ల కోసమే ప్యాకేజీలకు ఒప్పుకుంటున్నారని ఆరోపించారు. ఖాళీ సమయాల్లో ప్రజల్లోకి వచ్చే వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. కొన్ని పార్టీలు ఎప్పుడు పుడతాయో ఎప్పుడు మూతపడతాయో తెలియదని ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు.